: కొత్త రూ.20, రూ.50 నోట్లను విడుదల చేయనున్న ఆర్బీఐ


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) త్వరలో రూ.20, రూ.50 కొత్త నోట్లను జారీ చేయనుంది. కొత్తగా విడుదల చేయనున్న రూ.20, రూ.50 నోట్లలో చిన్న మార్పులు మాత్రమే ఉంటాయని, డిజైన్, సెక్యూరిటీ ఫీచర్స్ పాత నోట్ల మాదిరిగానే ఉంటాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. కొత్త రూ.20 నోట్ల నంబర్ ప్యానెల్ లో ఇన్ సెట్ లెటర్ గా ‘ఎల్’ ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న రూ.20, రూ.50 నోట్లు చలామణి అవుతాయని ఆ ప్రకటనలో ఆర్బీఐ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News