: బ్లూ ఫిల్మ్ కేసు వెనుక చిరంజీవి హస్తముందా?: సుమన్ కు టీవీ 9 ప్రశ్న


తెలుగు చిత్ర సీమలో సూపర్ హీరోగా పేరు తెచ్చుకుంటున్న వేళ, నీలి చిత్రాల కేసులో ఇరుక్కుని, ఏడాదికి పైగా జైల్లో గడిపి, ఆపై సినిమా అవకాశాలు సన్నిగిల్లి, ద్వితీయ స్థాయి హీరోగా పరిశ్రమలో మిగిలిపోయిన సుమన్, టీవీ 9 నిర్వహించే 'ఎన్ కౌంటర్ విత్ మురళీకృష్ణ'లో పాల్గొన్నాడు. ఇక సుమన్ జైలుకు వెళ్లిన విషయంలో ఇప్పటికీ తెలుగు సినీ అభిమానుల్లో ఉన్న అనుమానాన్నే ప్రశ్నగా ఆయన ముందుంచింది టీవీ 9. బ్లూ ఫిల్మ్ కేసులో సుమన్ ను ఇరికించింది చిరంజీవేనని, ఇప్పటికీ ఆ ప్రచారం పెద్దఎత్తున ఉందని, దీనిని మీరు కూడా నమ్ముతున్నారా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి "గూండాస్ యాక్ట్ వేసిన కారణం ఏంటంటే, వన్ ఇయర్ బెయిల్ లేకుండా, వన్ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో శిక్షను అనుభవించాలని, నేను బయటకు రాకూడదని వాళ్లు ట్రై చేశారు" అన్న సుమన్ వ్యాఖ్యలను ప్రోమోలో టీవీ 9 చూపిస్తోంది. ఈ ప్రశ్నకు సుమన్ సమాధానం తెలియాలంటే, నేటి రాత్రి ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని చూడాల్సిందే.

  • Loading...

More Telugu News