: కర్నూలు జిల్లాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు దుర్మరణం
కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని ప్యాపిలి మండలం ఎన్.రంగాపురం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని వెంటనే డోన్ ఆస్పత్రికి తరలించారు. మృతులను వెంగళాంపల్లి గ్రామస్తులుగా గుర్తించారు. కాగా ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో బైకును లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు.