: కర్నూలు జిల్లా డోన్ వద్ద ట్రావెల్స్ బస్సు దగ్ధం.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు
కర్నూలు జిల్లాలోని డోన్ టోల్‌గేట్ వద్ద ఓ ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఎస్ఆర్ ఎస్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంజిన్ లోనుంచి ఒక్కసారిగా పైకి ఎగసిన మంటలు బస్సంతా వ్యాపించాయి. దీంతో రహదారిపైనే బస్సు పూర్తిగా దగ్ధమైంది.