: ప్రేమించానన్నాడు...పెళ్లి చేసుకున్నాడు...గొంతు కోశాడు!


సంగారెడ్డి జిల్లాకు చెందిన మమత (19) హైదరాబాదు, కొత్తపేటలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌ లో ఉంటూ నర్సింగ్ విద్యనభ్యసిస్తొంది. ఈ క్రమంలో బీకామ్ చదువుతున్న రమేష్ అనే యువకుడిని ప్రేమించింది. వీరిద్దరు పెద్దలకు చెప్పకుండా గత జనవరిలో పెళ్లి చేసుకున్నారు. ఇది తెలుసుకున్న మమత తల్లిదండ్రులు రమేష్ ను మందలించి, మమతకు కౌన్సిలింగ్ ఇచ్చి, అతనికి దూరంగా ఉండమని హెచ్చరించారు. దీంతో ఆమె దూరంగా ఉంది. ఆమె గురించి గాలించిన రమేష్ కొత్తపేటలో ఆమె ఉంటున్న విషయం గుర్తించి, ఆమెపై బ్లేడుతో దాడి చేశాడు. గొంతు కోయడంతో మెడభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. దీనిని గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని, ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆమెకు వైద్యులు చికిత్సనందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News