: 13,860 కోట్ల నల్లధనాన్ని ప్రకటించిన గుజరాత్ వ్యాపారి అరెస్ట్
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐడీఎస్ పథకం కింద నల్లదనాన్ని మార్చుకునేందుకు 13,860 కోట్ల రూపాయల మొత్తాన్ని వెల్లడించిన గుజరాత్ వ్యాపారి మహేష్ షా నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు అయ్యారు. తన వద్ద పన్ను చెల్లించని 13,860 కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిపిన మహేష్ షా తరువాత కనిపించకుండా పోయారు. దీంతో ఆయన నివాసం ఉండే అహ్మదాబాద్ లో తీవ్ర కలకలం రేపింది. ఆయనకోసం పోలీసులు పలు టీంలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన మహేష్ షా ఓ టీవీ ఛానెల్ చర్చలో పాల్గొని కలకలం రేపారు. దీంతో టీవీ ఛానెల్ సమాచారంతో రంగప్రవేశం చేసిన పోలీసులు, ఆయనను అదుపులోకి తీసుకున్నారు.