: దేవినేని మురళి పాత్రకు న్యాయం చేశాననే అనుకుంటున్నాను: హ్యాపీడేస్ వంశీ
రాంగోపాల్ వర్మ 'వంగవీటి' సినిమాలో 'దేవినేని మురళి' పాత్రలో నటించానని హ్యాపీడేస్ వంశీ తెలిపాడు. విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీ లో నిర్వహించిన 'వంగవీటి' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, తనను రాంగోపాల్ వర్మకు పరిచయం చేసిన 'సిరాశ్రీ'కి, 'దేవినేని మురళి' పాత్రను పోషించగలనని నమ్మి ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన రాంగోపాల్ వర్మకు ధన్యవాదాలు అని చెప్పాడు. వర్మను జీవితాంతం మర్చిపోలేనని వంశీ చెప్పాడు. తనకు అప్పగించిన పాత్రకు న్యాయం చేశాననే అనుకుంటున్నానని వంశీ తెలిపాడు.