: ఇండోనేషియన్ విమానం మిస్సింగ్... కూలిపోయినట్టు అనుమానం
ఇండోనేషియన్ పోలీస్ విమానం ఒకటి ఈ రోజు మిస్ అయింది. మిస్ అయిన విమానంలో 15 మంది ఉన్నారని... ఈ విమానం దక్షిణ సింగపూర్ లోని బాతమ్ ద్వీపానికి వెళుతోందని ఆ దేశ పోలీసులు తెలిపారు. మెన్సానాక్, సెబాంగ్కా లేదా జెంటార్ ద్వీపకల్ప ప్రాంతాల్లో ఈ విమానం కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. విమానం కోసం సెర్చ్ టీమ్ ఇప్పటికే గాలింపు చేపట్టిందని పోలీసులు తెలిపారు. నాలుగు రోజుల క్రితమే ఇంధనం లేక కొలంబియా పర్వత ప్రాంతాల్లో ఓ విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 80 మంది దుర్మరణం పాలవగా... అందులో ఓ సాకర్ జట్టు కూడా ఉంది.