: వాజ్‌పేయితో కలిసి హుషారుగా డ్యాన్స్ చేసిన మోదీ అరుదైన వీడియో.. నెట్టింట షికార్లు
మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి చేతిలో చేయి వేసి నరేంద్ర మోదీ డ్యాన్సు చేసిన ఒకప్పటి సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట షికార్లు కొడుతోంది. అందులో హోలీ పండగ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు రంగులు చల్లుకొని ఆనందంగా గడిపారు. హిందీ పాట రంగ్ బర్సేకు వాజ్‌పేయి చేతులూ కాళ్లూ కదిలిస్తూ నృత్యం చేస్తుండగా ఆయనతో పాటు మోదీ, ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా ఎంతో హుషారుగా డ్యాన్సులు వేశారు. ఈ వీడియోలో ఇప్పటి కేంద్ర మంత్రి విజయ్ గోయల్ కూడా వాజ్‌పేయితో ఉన్నారు. అయితే, ఈ వీడియో ఏ ఏడాది తీశారో, ఏ ప్రాంతంలో తీశారో పూర్తి వివరాలు తెలియలేదు. ఈ వీడియోలో మోదీ ఇప్పటికన్న ఎంతో యంగ్‌గా కనిపిస్తున్నారు. సుమారు 15 ఏళ్ల క్రితం ఈ సంబరాల్లో వాజ్‌పేయితో మోదీ కలిసి పాల్గొన్నట్లు తెలుస్తోంది.