: రూ.9 లక్షల విలువచేసే కొత్తనోట్లను కానుకగా వేసిన భక్తులు
రాజస్థాన్ లోని ప్రసిద్ధ సన్వాలియా ఆలయంలో భక్తులు భారీగా కొత్తనోట్లను విరాళంగా సమర్పించుకున్నారు. మొత్తం రూ.9లక్షలు విలువజేసే కొత్త రూ.2వేలు, రూ.500నోట్లను భక్తులు విరాళంగా ఇచ్చినట్లు ఆ దేవాలయ అధికారులు చెప్పారు. తాజాగా హుండీ లెక్కింపు చేశామని వాటిలో రద్దైన పెద్ద నోట్లతో పాటు ఈ కొత్తనోట్లు కనిపించాయని చెప్పారు. రెండు నెలల అనంతరం తాజాగా హుండీ లెక్కింపు జరిపామని, గత నెల నవంబర్ 28న జరిపిన ఈ హుండీ లెక్కింపులో మొత్తం 441 కొత్త రూ.2వేల నోట్లు, 67 కొత్త రూ.500 నోట్లు వచ్చినట్లు తెలిపారు. పాత, కొత్త నోట్లు అన్నీ కలిపితే మొత్తం రెండు నెలల్లో ఆలయానికి దాదాపు రూ.4.5కోట్లు వచ్చాయని పేర్కొన్నారు.