: పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదులు, సైన్యం మధ్య కాల్పులు.. ఉగ్రవాది హతం
పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో చొరబడేందుకు ఉగ్రవాదులు మరోమారు ప్రయత్నించారు. వారి పన్నాగాన్ని గుర్తించిన సైన్యం వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఓ పాక్ చొరబాటుదారుడు హతమయ్యాడు. చొరబాటుదారులతో ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, బీఎస్ఎఫ్కు మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పుల్లో ఎంతమంది ఉగ్రవాదులు పాల్గొన్నారన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు.