: ట్రంప్ భార్య మెలానియాకు మరో డిజైనర్ షాక్


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య, ఫస్ట్ లేడీ ఆఫ్ అమెరికాకు మరోసారి అవమానం ఎదురైంది. గత నవంబర్ లో ఫ్రెంచ్‌ ఫ్యాషన్ డిజైనర్ థియల్లెట్ ట్రంప్ భార్య అయినందున మెలానియాకు దుస్తులు డిజైన్ చేయనని తెలిపిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆమె ఇతర డిజైనర్లకు ఆమె దుస్తులు డిజైన్ చేయవద్దంటూ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ ప్రభావమో లేక ట్రంప్ పై వ్యతిరేకత కారణంగానో మరో ఫ్యాషన్ డిజైనర్ మెలానియాకు దస్తులు డిజైన్ చేసేందుకు నిరాకరించడం అమెరికాలో కలకలం రేపుతోంది. మెలానియా ట్రంప్‌కు దుస్తులు డిజైన్ చేసేది లేదని సెలెబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ టామ్ ఫోర్డ్ తేల్చి చెప్పాడు. అమెరికా తొలి మహిళగా చెప్పుకునేందుకు ఆమె సరిపోరని, కాబట్టి ఆమెకు దుస్తులు డిజైన్ చేసేది లేదని కుండ బద్దలు కొట్టాడు. ‘‘ఆమె నా ఊహలకు తగ్గట్టుగా లేదు. కొన్నేళ్ల క్రితం తనకు దుస్తులు డిజైన్ చేయమని నన్ను కోరారు. అయితే అందుకు నేను నిరాకరించా’’ అని ఫోర్డ్ తెలిపాడు. దీంతో ట్రంప్ ను అధ్యక్షుడిగా అంగీకరిస్తున్నా...అతని కారణంగా మోడల్ అయిన మెలానియా గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News