: విశాఖకు మరో తుపాను ప్రమాదం


విశాఖపట్టణానికి మరో తుపాను ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సూపర్ సైక్లోన్ గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీని ప్రభావం కొస్తాతీరంపై ఉంటుందని అంతర్జాతీయ వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. గతంలో వచ్చిన హుద్ హుద్ తుపాను కోస్తా తీరాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. హుద్ హుద్ చేసిన నష్టం నుంచి కోలుకున్న విశాఖ ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయిలో సగర్వంగా తలెత్తుకుంటోంది. అలాంటి విశాఖపై మరోసారి వాతావరణం కన్నెర్ర చేయనుందన్న వార్తలతో కోస్తావాసులు ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News