: ప్రభుత్వ రంగ బ్యాంకులకు నష్టాల కష్టాలు.. పదిహేడు వేల కోట్లకు పైగా నష్టం!


2015-16 ఆర్థిక సంవత్సరంలో 28 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.17,993 కోట్ల నికర నష్టాన్ని చవిచూశాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ లోక్ సభలో వెల్లడించారు. అత్యధికంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.6,089 కోట్లు నష్టపోయింది. ఆ తర్వాతి వరుసలో బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడీబీఐ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూకో బ్యాంక్, సిండికేట్ బ్యాంకులు వరుసగా రూ.5,396 కోట్లు, రూ.3,974 కోట్లు, రూ.3,665 కోట్లు, రూ.2,897 కోట్లు, రూ.2,799 కోట్లు,రూ.1,643 కోట్లు, రూ.1,418 కోట్లు నష్టపోయాయి. బ్యాంకులు నష్టాల్లో ఉండటానికి ప్రధాన కారణం పేరుకుపోయిన నిరర్థక ఆస్తులేనని అన్నారు. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్ బీఐ) రూ.9,951 కోట్లు, ఎస్ బీహెచ్ రూ.1,065 కోట్లు, ఎస్ బీబీజే రూ.851 కోట్లు, ఆంధ్రా బ్యాంకు రూ.540 కోట్లు లాభాలు వచ్చినట్లుగా ఆయా బ్యాంకులు తమ ఖాతాల్లో చూపాయని, బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా బ్యాంక్ లకు వచ్చే నాలుగేళ్లలో రూ.70 వేల కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సంతోష్ గంగ్వార్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News