: అందాల రాశీ ఖన్నా పుట్టినరోజు వేడుకలు అదిరాయి!
అందాల రాశీ ఖన్నా పుట్టినరోజు వేడుకల్లో యువహీరోలు వరుణ్ తేజ్, నాని, రానా, రామ్ పాల్గొన్నారు. నవంబర్ 30 వ తేదీన తన పుట్టిన రోజు జరుపుకున్న రాశీ ఖన్నా, తనను అభినందిస్తున్న నటీనటుల ఫొటోలను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రముఖ హీరోయిన్ లు రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి, హాస్యనటుడు వెన్నెల కిషోర్ తదితర ప్రముఖులు ఆమెకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ రాశీ ఖన్నా ధన్యవాదాలు తెలిపింది.