: తుగ్లక్ పాలనకు తెరతీస్తే సహించం: కేంద్రంపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఫైర్


కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లధనం విషయంలో కేంద్రం అత్యుత్సాహానికి పోతోందని ఆయన విమర్శించారు. ఇప్పుడు బంగారం జోలికి వచ్చారని... దాని జోలికి వస్తే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తాత, ముత్తాల నుంచి వస్తున్న ఆభరణాలకు లెక్కలు చెప్పమంటే, తాము చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. వివాహితులకు 500 గ్రాముల బంగారమే అని నిబంధనలు పెడుతున్నారని... అడ్డదిడ్డమైన నిబంధనలతో మహిళలను ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. బంగారమే లేని వాళ్లకు కేంద్రం ఏమైనా ఇస్తుందా? అని ప్రశ్నించారు. తుగ్లక్ పాలనకు తెరతీస్తే సహించబోమని అన్నారు.

  • Loading...

More Telugu News