: ఇంతకీ, శ్రీదేవి కుమార్తె ఎవరితో డేటింగ్ చేస్తోంది.. శిఖర్ తోనా? అక్షిత్ తోనా?


ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉందని గత కొంతకాలంగా బాలీవుడ్ పత్రికలు కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఒళ్లు మండిన శ్రీదేవి ప్రేమ, గీమకు దూరంగా ఉండి, సినిమాలపై దృష్టి పెట్టు అని ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ వార్తలు వెలువడిన సంగతీ మనకు తెలుసు. ఇటీవల ఓ కార్యక్రమానికి శ్రీదేవి, జాహ్నవితో వెళ్తూ శిఖర్ పహారియా మీడియా కంటబడడంతో వారి మధ్య సఖ్యత కుదిరిందని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అక్షిత్ రాజన్ అనే యువకుడు.. జాహ్నవి కపూర్ తో తాను సన్నిహితంగా ఉన్న ఫోటోలను పోస్టు చేస్తూ, 'ఐ లవ్యూ జాహ్నవీ' అంటూ మెసేజ్ లు పోస్టు చేయడంతో శ్రీదేవి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. జాహ్నవి ఇంతకీ శిఖర్ పహారియాతో ప్రేమలో ఉందా? అక్షిత్ రాజన్ తో ప్రేమలో ఉందా? లేక ఇద్దరితోనూ ప్రేమలో ఉందా? అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఈ ముగ్గురి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Loading...

More Telugu News