: ప్రతిరోజూ నెగెటివ్ వార్తలు రాయడం కాదు... చేతనైతే ఐదుగురికి సహాయం చేయండి: మీడియాకు సూచించిన చంద్రబాబు


నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న జనాలను మరింత రెచ్చగొట్టొద్దని మీడియా ప్రతినిధులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రతి రోజూ నెగెటివ్ వార్తలు రాయడం కాదని... చేతనైతే ఐదుగురికి సహాయం చేయాలని సూచించారు. పత్రిక, టీవీ ప్రతినిధులందరికీ తాను ఈ మాట చెబుతున్నానని తెలిపారు. జనాలకు మంచి చెప్పి పుణ్యం కట్టుకోవాలని... అంతేకాని, వారిని రెచ్చగొట్టేలా వార్తలు రాసి, వారి కష్టాలను మరింత పెంచవద్దని చెప్పారు. తన మాటలను మీడియా అర్థం చేసుకుంటుందని భావిస్తున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News