: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలను బహిర్గత పరచాలి: కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
పెద్దనోట్ల రద్దు అంశంలో దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పలువురు న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఈ రోజు విచారించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలను బహిర్గత పరచాలని కేంద్రప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. గ్రామీణ ప్రాంతాల్లో సహకార బ్యాంకులపై ఆధారపడే వారి పరిస్థితి ఏంటని అడిగింది. అన్ని అంశాలపై సమగ్ర వివరాలు అందించాలని చెప్పింది. ఈ అంశంలో వచ్చిన అన్ని పిటిషన్లను సోమవారం విచారిస్తామని పేర్కొంది.