: చైనాలో ఘోర బస్సు ప్రమాదం.. 18 మంది మృతి
చైనాలో ఈ రోజు ఉదయం పెను ప్రమాదం జరిగింది. ఆ దేశంలోని హుబెయ్ ప్రాంతం గుండా వెళుతున్న ఓ బస్సు మావోలింగ్ టౌన్‌షిప్ వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పడంతో నదిలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 18 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ రోజు ఉదయం ఆ ప్రాంతంలో పొగమంచు అధికంగా ఉండడం, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడమే ప్రమాదానికి కారణాలని అక్కడి పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.