: ఇక బ్యాంకులే గతి... ఓ తరం నోట్లు నేటితో చెల్లు!


ఓ తరం ఆర్థిక అవసరాలను తీర్చిన పాత రూ. 500 నోట్లు నేటితో కనుమరుగు కానున్నాయి. నవంబర్ 8న నోట్ల రద్దును ప్రకటించిన తరువాత పెట్రోలు బంకులు, విమాన టికెట్లు తదితర చోట్ల పాత కరెన్సీని చెల్లుబాటు చేసుకునే వెసులుబాటు లభించిన సంగతి తెలిసిందే. ఆపై రెండు వారాలకు రూ. 1000 నోట్ల బహిరంగ మార్పిడిని నిలిపివేయగా, నేటితో రూ. 500 మార్పిడి కూడా చెల్లదు. ఈ మేరకు కేంద్రం గురువారమే నోటిఫికేషన్ విడుదల చేస్తూ, డిసెంబర్ 2 తరువాత పెట్రోలు, విమాన టికెట్లను పాత నోట్లతో కొనుగోలు చేసేందుకు వీల్లేదని చెప్పింది. దీంతో రూ. 500 నోట్ల బహిరంగ మార్పిడికి నేడు ఆఖరి రోజు కానుంది. రేపటి నుంచి పెట్రోలు బంకుల్లో వీటిని స్వీకరించబోరు. ఆసుపత్రులు వంటి కొన్ని కేటగిరీల్లో మాత్రం రూ. 500 నోట్లను తదుపరి నోటిఫికేషన్ వెలువరించేంత వరకూ స్వీకరిస్తారు. ఏది ఏమైనా ఓ తరం అపురూపంగా వాడుకున్న, ఓ తరం అవసరాలను తీర్చిన పాత కరెన్సీ నేటితో దాదాపు కనుమరుగైనట్టే. ఇంకా ఇవి ఎవరి దగ్గరైనా ఉంటే, వాటిని బ్యాంకుల్లో జమ చేసుకోవడమే ప్రజల ముందున్న ఏకైక మార్గం

  • Loading...

More Telugu News