: కొత్త కరెన్సీ నోట్లపై కొత్త డౌటు.. జంతువుల కొవ్వుతో చేశారా?


దేశంలోకి కొత్త కరెన్సీ విడుదల కాగానే, రూ. 2 వేల నోటును నీళ్ల కింద తడిపి, నానబెట్టి, రంగు వెలిసి పోతోందని పసిగట్టి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టిన ఘటనను మరువక ముందే మరిన్ని వెరైటీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ఇంగ్లండులో కరెన్సీ నోట్లను జంతువుల కొవ్వుతో తయారు చేసినట్టు అక్కడి బ్యాంకులు స్వయంగా అంగీకరించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, భారత ప్రభుత్వం కూడా అలాగే చేసిందా? అన్ని విషయాన్ని తేల్చేందుకు కొత్త కరెన్సీ నోట్లను మరుగుతున్న నూనెలో వేసి ఏం జరుగుతుందో చూస్తున్నారు. నోట్లలో ఉబ్బెత్తుగా ఉన్న భాగాలు జంతువుల కొవ్వుతో ముద్రితమైనవని అనుమానిస్తున్నారు. ఇక నోటు తయారీలో ఎలాంటి కొవ్వు పదార్థాలూ వాడలేదన్న వివరణ వచ్చేంత వరకూ ఈ వీడియోలు హల్ చేస్తుంటాయనడంలో సందేహం లేదు.

  • Loading...

More Telugu News