: 42 లక్షల రూపాయల నకిలీ 2,000 నోట్లు స్వాధీనం!


బ్లాక్ మనీ, నకిలీ నోట్లతో సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుస్తోందంటూ కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తూ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ, 2000 రూపాయల నోట్లను వినియోగంలోకి తీసుకొచ్చింది. సరిపడా నోట్లను బ్యాంకులకు సరఫరా చేయడంలో కేంద్రం విఫలం కావడంతో సామాన్యుల్లో చాలా మందికి ఈ నోట్లు ఎలా ఉంటాయన్న సంగతి కూడా తెలియలేదు. దీనిని అవకాశంగా తీసుకున్న నకిలీగాళ్లు 2,000 నోట్లకు కూడా నకిలీ మకిలి అంటించేశారు. ఈ క్రమంలో, పంజాబ్‌ కు చెందిన ముగ్గురు 42 లక్షల రూపాయల కొత్త 2000 రూపాయల నకిలీ నోట్లను ముద్రించడం కలకలం రేపుతోంది. ఇలా ముద్రించిన నకిలీ 2,000 నోట్ల రూపాయలను 30 శాతం కమీషన్‌ తో రద్దయిన 500, 1000 రూపాయల నోట్లకు మార్పిడి చేస్తున్నారన్న సమాచారంతో రంగప్రవేశం చేసిన మొహాలీ పోలీసులు రియల్ ఎస్టేట్ డీలర్ సుమన్ నాగ్‌ పాల్, అతని బంధువులు అభినవ్ వర్మ, వికాశ్ లను అదుపులోకి తీసుకున్నారు. లక్షల రూపాయల కొత్త 2000 నకిలీ నోట్లతో పాటు ఎర్ర బుగ్గ ఉన్న కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News