: హాలీవుడ్ దర్శకుడి ప్రశంసలతో ఉబ్బితబ్బిబ్బవుతున్న అలియాభట్!


బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, అలియా భట్ జంటగా నటించిన ‘డియర్ జిందగీ’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రంలోని వారి నటనపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా, హాలీవుడ్ దర్శకుడు పాల్ ఫెయిగ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వారిని ప్రశంసించారు. ఈ సందర్భంగా షారూక్, అలియా భట్ లు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా, అలియా భట్ ‘చంద్రుడి కన్నా పైన ఉన్నట్లు ఉంది’ అంటూ తన ఆనందాన్ని ట్విట్టర్ ఖాతా ద్వారా వ్యక్తం చేసింది. కాగా, ఈ చిత్ర దర్శకుడు గౌరీ షిండే ను కూడా పాల్ ఫెయిగ్ ప్రశంసలతో ముంచెత్తారు. షారూక్, అలియాలను ప్రశంసించిన ట్వీట్ లోనే గౌరీ షిండే అద్భుతమైన రైటర్, డైరెక్టర్ అంటూ ఫెయిగ్ మెచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News