: కాంగ్రెస్ పార్టీ వాళ్లే రాహుల్ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసుంటారు!: సుబ్రహ్మణ్యస్వామి


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురి కావడంపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. రాహుల్ గాంధీ తన ప్రవర్తనతో చాలా మందిని బాధపెట్టారని అన్నారు. ఆ పార్టీలోని వ్యక్తులే రాహుల్ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసే అవకాశం ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా, రాహుల్ ట్విట్టర్ ఖాతాను నిన్న హ్యాక్ చేసిన నిందితులు.. ఆయనపై దుర్భాషలాడుతూ పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఈ విషయమై విచారణ చేపట్టారు.

  • Loading...

More Telugu News