: యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్‌ల పెళ్లిపై స్పందించిన యువీ వదిన ఆకాంక్ష!
చంఢీగఢ్‌కు సమీపంలోని బాబా రాంసింగ్ డేరాలో పంజాబీ సంప్రదాయం ప్రకారం నిన్న టీమిండియా స్టార్ ఆటగాడు యువరాజ్‌సింగ్, బాలీవుడ్ నటి హాజెల్ కీచ్‌ల వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే, హాజెల్ తో యువరాజ్ గొడవలు పడకుండా ఉండాలంటే ఇలా అయితే బాగుంటుందంటూ యువీ వదిన ఆకాంక్ష శర్మ ఓ సూచన చేసింది. యువీ వదిన పరస్పర విభేదాల కారణంగా యువరాజ్ సోదరుడు జొరావర్ సింగ్ తో విడిపోయింది. తాజాగా ఆమెను యువీ వివాహంపై స్పందించాలని విలేకరులు అడిగారు. తన భర్తతో తనకు వచ్చిన గొడవలకి తన అత్తగారు షబ్నమే కారణమని ఇప్పటికే పలుసార్లు చెప్పిన ఆకాంక్ష.. యువీ, హాజెల్ కీచ్‌ల మధ్య షబ్నమ్ జోక్యం చేసుకోకుండా ఉండాలని వ్యాఖ్యానించింది. యువీని వివాహమాడిన హాజెల్ ఓ అదృష్టవంతురాలని ఆకాంక్ష పేర్కొంది. తన భర్త ప్రతి విషయంలోనూ తల్లి మాటే వింటాడని, హాజెల్ తన భర్త లాంటి వ్యక్తిని కాకుండా మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుందని చెప్పింది. యువీ ఢిల్లీలో మూడు రోజులకు మించి ఎప్పుడూ ఉండడని పేర్కొంది.