: మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రిలో క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన సైనా నెహ్వాల్
ఇటీవల జరిగిన హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్లో సెమీ పైనల్‌కు చేరకుండా నిరాశపర్చిన భారత బ్యాడ్మింటన్ స్టార్, హైదరాబాదీ సైనా నెహ్వాల్ మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రిలో అద్భుతంగా రాణిస్తోంది. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో ఇండోనేషియా షట్లర్ అయస్తిన్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలి సెట్ మినహా మిగతా రెండు సెట్లలోనూ విజయం సాధించింది. అయస్తిన్‌ను 17-21, 21-18, 21-12తో ఓడించి, క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మరోవైపు గత ఏడాది ఇదే టోర్నిలో రన్నరప్గా నిలిచిన పీవీ సింధు చివరి నిమిషంలో మకావు ఓపెన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. త్వరలో దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ కోసం ఆమె కసరత్తు చేసే నేపథ్యంలో సింధు ఈ టోర్నీలో ఆడడం లేదు.