: మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం... కేసు కొట్టేయండి: మలయాళ శృంగార తార
మలయాళంలో పలు అడల్ట్ మూవీస్ లో నటించి, బాగా పాప్యులర్ అయిన శృంగార తార బాబాలోనా తాను పెళ్లి చేసుకున్నట్లు మరోసారి తెలిపింది. వివరాల్లోకి వెళ్తే, ఓ మంత్రగాడి చేతిలో తన మనవరాలు చిక్కుకున్నదని... అతడి చెర నుంచి తన మనవరాలిని రక్షించాలంటూ ఆమె నానమ్మ కృష్ణకుమారి చెన్నై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. ఆమె చెన్నైలోని సాలిగ్రామంలో నివసిస్తోంది. తన మనవరాలు 'పిరందాచ్చు' అనే సినిమా ద్వారా చిత్రరంగంలోకి ప్రవేశించిందని... ఆమె ఉన్నత స్థితికి చేరుకోవడానికి తాను చాలా కృషి చేశానని ఫిర్యాదులో పేర్కొంది. అయితే, సుందర్ పాల్ రాజ్ అనే ఓ వ్యక్తి తాంత్రిక చర్యలతో బాబిలోనాను వశపరుచుకున్నాడని... అతడి నుంచి బాబిలోనాను రక్షించాలని కోరింది. దీనిపై బాబిలోనా స్పందించింది. సుందర్ పాల్ ఓ జిమ్ లో తనకు పరిచయం అయ్యాడని... ఆ తర్వాత అతడిని ప్రేమ వివాహం చేసుకున్నానని ఆమె చెప్పింది. గత ఏడాది తమ వివాహం జరిగిందని తెలిపింది. ఈ నేపథ్యంలో, తన నానమ్మ ఇచ్చిన ఫిర్యాదును కొట్టివేయాలని పోలీసులను ఆమె కోరారు. అంతేకాదు, తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నానమ్మపై ఆమె ఆగ్రహంతో ఉందట.