: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. విజయవాడ యువతి దుర్మరణం
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడకు చెందిన యువతి దుర్మరణం పాలైంది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు చుండూరి సాయి తేజశ్వి కొంతకాలం క్రితం అమెరికా వెళ్లింది. ప్రీమాంట్‌లో ఆమె నిన్న రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ఆమె మృతివార్త తెలిసి విజయవాడలో విషాద ఛాయలు అలముకున్నాయి. తేజశ్వి మృతదేహాన్ని ఆదివారం విజయవాడకు తీసుకురానున్నారు.