: రాజమహేంద్రవరంలో విషాదం... నాలుగంతస్తుల హాస్టల్ నుంచి దూకిన మెడికో శుభశ్రీ
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని జీఎస్ఎల్ మెడికల్ కళాశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వైద్యవిద్యను అభ్యసిస్తున్న శుభశ్రీ హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి తీవ్ర గాయాలపాలు కాగా, చూసి స్పందించిన ఇతర విద్యార్థినులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుభశ్రీ మృతి చెందింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. శుభశ్రీ ఆత్మహత్యకు పాల్పడేంత పిరికి అమ్మాయి కాదని తోటి స్నేహితులు వాదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. ఈ ఘటనతో కాలేజీలో విషాద ఛాయలు అలముకున్నాయి.