: తమిళనాడును వెంటాడుతున్న 'నాడా' తుపాను భయం.. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
'నాడా' తుపాను భయంతో తమిళనాడు అప్రమత్తమైంది. తుపాను భయం పొంచి ఉన్న చెన్నై సహా ఐదు జిల్లాల్లోని పాఠశాలలో నేడు, రేపు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. రేపు తమిళనాడు, పుదుచ్చేరి మధ్యలో తుపాను తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తుపాను కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 'నాడా' తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ కనిపించనుంది. రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను భయంతో ఏపీ పోర్టుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.