: పాకిస్థాన్ తో మాటల ముచ్చటే లేదు: తేల్చిచెప్పిన విదేశీ వ్యవహారాల శాఖ


పంజాబ్‌ లోని అమృత్‌ సర్‌ లో డిసెంబర్ 3న జరగనున్న 'హార్ట్ ఆఫ్ ఆసియా' సదస్సులో పాకిస్థాన్ తో ద్వైపాక్షిక చర్చల ముచ్చటే లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. ఈ సదస్సుకు పాక్ విదేశీ వ్యవహారాల చీఫ్ సర్తాజ్ అజీజ్ హాజరుకానున్నారు. ద్వైపాక్షిక సమావేశానికి సంబంధించి ఇస్లామాబాద్ నుంచి ఇంతవరకూ ఎలాటి అధికారిక అభ్యర్థన రాలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ సదస్సులో 40 దేశాలకు చెందిన మంత్రులు హాజరుకానున్నారు. ఇందులో ఆప్ఘనిస్తాన్‌ లో శాంతి, సహకారం, ఆర్థికాభివృద్ధిపై చర్చించనున్నారు. దీంతో సదస్సును ప్రధాని మోదీ, ఆప్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో అనారోగ్యంతో బాధపడుతున్న విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ స్థానంలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పాల్గొననున్నారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News