: ఏపీ నుంచి ఎదురైన సవాళ్లను రాజీవ్‌శర్మ ఓపికతో అధిగమించారు: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రాజీవ్‌శర్మ ఏపీ నుంచి ఎదురైన సవాళ్లను ఎంతో ఓపికతో అధిగమించారని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ రోజు రాజీవ్‌శర్మ పదవీ విరమణ చేస్తోన్న సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ మనం అమల్లో పెడుతున్న ఆలోచనలను ఇతరులు కూడా అనుసరిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజీవ్‌శర్మలాంటి సమర్థవంతమైన అధికారులు ఉండడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో చేసిన సమగ్రకుటుంబ సర్వేపై హరియాణా బృందం తెలంగాణకు వచ్చి రాజీవ్‌శర్మ నుంచి వివరాలు తీసుకొని వెళ్లిందని ఆయన చెప్పారు. పదవీ విరమణ తరువాత కూడా రాజీవ్‌శర్మ సేవలను ఉపయోగించుకోవాలని తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు రాజీవ్‌శర్మ ఎంతో కృషి చేశారని అన్నారు.