: టీఆర్ఎస్, కాంగ్రెస్ బాహాబాహీ...రసాభాసగా మారిన జగిత్యాల మున్సిపల్ సమావేశం


కొత్త జిల్లాగా ఏర్పడిన జగిత్యాల మున్సిపల్‌ సమావేశం రసాభాసగా మారింది. అభివృద్ధి పనుల్లో అవినీతికి పాల్పడుతున్నారని, చేసిన పనులకే మళ్లీ బిల్లులు పెట్టి నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్‌ పై టీఆర్ఎస్, టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యుల తీరు పట్ల టీఆర్ఎస్, టీడీపీలు ఆందోళనకు దిగాయి. దీంతో సభాకార్యక్రమాలకు అంతరాయం కలిగింది. దీంతో కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్, టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఇది చిలికిచిలికి గాలివానగా మారడంతో ఇరువర్గాలు తోపులాటకు దిగాయి. దీంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

  • Loading...

More Telugu News