: 'ఈ సినిమాలో నటించ'నంటూ సెట్ నుంచి వెళ్లిపోయిన జయసుధ!


సీనియర్ నటీమణి, సహజనటి జయసుధ ఓ సినిమా నుంచి వాకౌట్ చేసిందనే వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్తే, చదలవాడ శ్రీనివాసరావు నిర్మాతగా, దర్శకుడిగా 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' అనే సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా ఆర్.నారాయణమూర్తి, ఆయనకు భార్యగా జయసుధ నటిస్తున్నారు. అయితే షూటింగ్ కు వచ్చే సమయానికి సంబంధించి ఆమెకు, శ్రీనివాసరావుకు గొడవ జరిగిందట. ఏ సినిమా షూటింగుకైనా ఉదయం పది గంటలకు వచ్చే జయసుధ... ఈ సినిమాకు కూడా అదే సమయానికి వస్తోందట. దీంతో, జయసుధను శ్రీనివాసరావు నిలదీశారట. అంతేకాదు, షూటింగ్ స్పాట్ లో ఉదయం 8.45కే ఉండాలని గట్టిగా చెప్పారట. దీంతో ఒళ్లు మండిపోయిన జయసుధ అసలు ఈ సినిమాలోనే తాను నటించనంటూ సెట్ నుంచి వెళ్లిపోయిందట. మరోవైపు, వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కొందరు యత్నిస్తున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News