: లక్షిత దాడుల తరువాత ఇప్పటి వరకు 15 మంది పాక్ రేంజర్లు, 10 మంది ఉగ్రవాదులను హతమార్చాం: బీఎస్ఎఫ్ డీజీ
భారత సైన్యం పీవోకేలోకి ప్రవేశించి ఉగ్రవాదుల శిబిరాలపై చేసిన లక్షిత దాడుల తరువాత సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతున్న పాక్ రేంజర్ల ఆగడాలను సమర్థవంతంగా తిప్పికొడుతున్నామని, ఇప్పటి వరకు 15 మంది పాకిస్థాన్ రేంజర్లను మట్టుబెట్టామని బీఎస్ఎఫ్ డీజీ కేకే శర్మ పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో చొరబాట్లకు ప్రయత్నించిన 10 మంది ఉగ్రవాదులను కూడా హతమార్చామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో భద్రతాదళాలకు ఇబ్బందులు ఏమీ లేవని స్పష్టం చేశారు. నగ్రోటాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఆయన సరిహద్దుల్లో భద్రతను సమీక్షించారు.