: తన భార్య రాజకీయ భవితవ్యంపై స్పందించిన ఒబామా
అమెరికా అధ్యక్షుడు ఒబామా భార్య మిచెల్లీ 2020 సంవత్సరంలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో... ఆ వార్తలపై ఒబామా స్పందించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మిచెల్లీ ఉండరని ఆయన స్పష్టం చేశారు. మిచెల్లీ చాలా ప్రతిభావంతురాలని... ప్రజలతో మమేకమై ఉండే వ్యక్తి అంటూ తన భార్యకు కితాబిచ్చారు. మిచెల్లీకి రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పారు. మరోవైపు, అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ గెలిస్తే... మిచెల్లీకి మంత్రి పదవి ఇస్తారనే కథనాలు కూడా గతంలో వెలువడ్డాయి. ట్రంప్ చేతిలో హిల్లరీ ఓడిపోవడంతో... వచ్చే ఎన్నికల్లో మిచెల్లీ పోటీ చేస్తారని కథనాలు వచ్చాయి.