: బాయ్ ఫ్రెండ్ చేత తన రక్తం తాగించి.... చంపబోయింది
రక్తపిశాచి కావాలనే బలమైన కోరికతో 19 ఏళ్ల యువతి అత్యంత దారుణానికి ఒడిగట్టింది. తన బాయ్ ఫ్రెండ్ ను ఇంటికి పిలిపించుకున్న విక్టోరియా వనట్టెర్... అతని చేత మద్యం సేవింపజేసింది. ఆ తర్వాత తన రక్తం తాగాలంటూ అతడిని ఒత్తిడి చేసింది. రక్తం తాగడానికి తొలుత ఒప్పుకోకపోయినా... ఆ తర్వాత ఓకే చెప్పాడు. దీంతో, తన చేతిని బాక్స్ కట్టర్ చేత కట్ చేయించి, తన రక్తాన్ని అతడిచేత తాగించింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య చిన్న గొడవ జరగడంతో... కత్తితో అతనిపై దాడి చేసి, చంపబోయింది. ఈ క్రమంలో, అతని భుజంలో కత్తి కూడా దిగింది. అనంతరం, పోలీసులు ఆ ఇంటికి చేరుకునే సమయానికి వారిద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఆ తర్వాత వారిద్దరినీ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ఈ ఘటన నవంబర్ 23వ తేదీన అమెరికాలోని స్ప్రింగ్ ఫీల్డ్ లో జరిగింది. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా... తనను క్షమించి వదిలేయాలని వేడుకుంది. దీంతో, 1.50 లక్షల డాలర్ల పూచీకత్తుతో ఆమెకు జైలు శిక్షను విధించారు.