: ముగిసిన అర్బాజ్, మలైకాల వివాహబంధం... విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకు హాజరు


బాలీవుడ్ లో మరో వివాహబంధం ముగిసింది. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్, నటి మలైకా అరోరాల 17 ఏళ్ల వివాహబంధం తెగిపోయింది. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న ఇద్దరూ... నిన్న ముంబైలోని ఫ్యామిలీ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్టు పేర్కొని, కోర్టులో డైవోర్స్ కు అప్లై చేశారు. కాగా, వీరిద్దరికీ ఒక కొడుకు ఉన్నాడు. బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో మలైకాకు అఫైర్ ఉండటమే... వీరిద్దరూ విడిపోవడానికి కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. తామిద్దరం విడిపోతున్నామంటూ గత మార్చిలోనే వారు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఇద్దరూ కలసి ఉండేలా ఇరు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేసినా... అవి ఫలించలేదు. విడాకులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత కోర్టు వీరికి ఆరు నెలల సమయం ఇస్తుంది. అప్పుడు కూడా వీరు విడిపోవాలని భావిస్తే... కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది.

  • Loading...

More Telugu News