: కుప్పకూలిన హెలికాప్టర్... దుర్మరణం చెందిన ఆఫ్ఘన్ బ్రిగేడియర్ జనరల్
ఆఫ్ఘనిస్థాన్ లో సైనిక హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఆ దేశ బ్రిగేడియర్ జనరల్ మహాయుద్దీన్ ఘోరీ దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటు మరికొందరు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ బాద్ఘిస్ ప్రావిన్స్ లో ఈ ప్రమాదం సంభవించినట్టు జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం సంభవించింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని... దీని వెనుక ఉగ్రవాదుల చర్యలు ఏమీ లేవని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేస్తున్న సమయంలో ప్రమాదం సంభవించిందని చెప్పారు. మరోవైపు, తామే హెలికాప్టర్ ను కూల్చి వేశామని తాలిబన్లు ప్రకటించుకున్నారు.