: సత్యదేవునిది సెపరేటు రూటు... చిన్న నోట్లతో హుండీ రికార్డు!
నోట్ల రద్దు తరువాత మిగతా అందరు దేవుళ్ల హుండీల్లో పెద్ద నోట్లు వచ్చి చేరుతున్న వేళ, అన్నవరం శ్రీసత్యనారాయణ స్వామి వారు మాత్రం చిల్లర వర్షంలో మునిగి తేలుతున్నారు. ఎంతగా అంటే గడచిన కార్తీక మాసంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో రూ. 14.01 కోట్ల ఆదాయం సత్యదేవునికి రాగా, అందులో అత్యధికం రూ. 100, రూ, 50, రూ. 10 నోట్లు ఉండటం గమనార్హం. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రూ. 2.67 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చింది. మొత్తం 3.40 లక్షల రూ. 10 రూపాయల నోట్లు, 80,027 రూ. 100 నోట్లు హుండీల్లోకి వచ్చాయి. ఇక వ్రతాల ఆదాయం రూ. 5.35 కోట్లకు పెరిగింది. కార్తీకమాసంలో 89,033 వ్రతాలు జరిగాయని అధికారులు తెలిపారు. అయితే, పెద్ద నోట్ల రద్దుతో హుండీల్లో పాత కరెన్సీ నిండుతుందని భావించినా అది జరగలేదని అధికారులు తెలిపారు. ఇక కొత్త రూ. 2 వేల నోట్లు 258, రూ. 500 కొత్త నోటు 1, రద్దయిన రూ. 1000 నోట్లు 1,068, రూ. 500 నోట్లు 5,813 వచ్చినట్టు అధికారులు తెలిపారు.