: ప్రస్తుత సమస్యలను జైట్లీ దృష్టికి తీసుకువెళ్లా..అక్కడి నుంచి ఎటువంటి సమాచారం లేదు: సీఎం చంద్రబాబు
పెద్దనోట్ల రద్దు అనంతరం నెలకొన్న ఇబ్బందులను అధిగమించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీ గురించి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిన్న తనకు ఫోన్ చేశారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత సమస్యలపై జైట్లీ దృష్టికి తీసుకువెళ్లానని, అక్కడి నుంచి ఎటువంటి సమాచారం రాలేదని అన్నారు. ముఖ్యమంత్రుల కమిటీ సమావేశంపై ఇంకా స్పష్టత రాలేదని, అవగాహన కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. రూ.2 వేల నోటు అవసరం లేదని స్పష్టంగా చెప్పానని, నల్లధనం నిర్మూలనపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ‘ఏపీ పర్స్’ అందుబాటులోకి వస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని, వ్యాపారులు ‘ఏపీ పర్స్’ ను సమర్థంగా వినియోగించుకోవచ్చని, ప్రభుత్వ చెల్లింపులన్నీ దీని ద్వారానే జరుగుతాయని అన్నారు.