: ఆసిస్ తో టెస్టు సిరీస్ కు స్థానం కోల్పోయిన గంభీర్
ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా రెండు టెస్టులకు సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ టీమిండియా జట్టును ఎంపిక చేసింది. ఈసారి జట్టులో ఓపెనర్ గౌతమ్ గంభీర్ కు సెలక్షన్ కమిటీ ఉద్వాసన
పలకడం ఆశ్చర్యం కలిగించే అంశం. 2008 అనంతరం భారత జట్టులో తన స్థానాన్ని
పదిలపరుచుకున్న గంభీర్, జట్టులో చోటు కోల్పోవడం ఇదే తొలిసారి.
కాగా, కొన్ని రోజుల నుంచి జట్టులో స్థానం లేక ఇబ్బందిపడుతున్న హర్భజన్ సింగ్ కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. వీరేంద్ర సెహ్వాగ్ చోటు దక్కించుకోగా, శిఖర్ ధావస్, భువనేశ్వర్ కుమార్ లు మొదటిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 22న ఆసిస్ తో తొలి టెస్టు జరుగుతుంది.