: ఐవీఎఫ్ లో కొత్న టెక్నాలజీ.. పిండాన్ని స్త్రీ గర్భంలోకి ప్రవేశపెట్టక ముందే చూడొచ్చు
ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) లో కొత్త టెక్నాలజీ వచ్చింది. ఈ పద్ధతిలో పిల్లలను కనాలనే దంపతులు, తమకు పుట్టబోయే చిన్నారులను ప్రయోగశాలలో పిండంగా ఉన్న మొదటి రోజు నుంచే చూడొచ్చు. పిండాన్ని స్త్రీ గర్భంలోకి ప్రవేశపెట్టక ముందే చూసే అవకాశమున్న ఈ కొత్త పద్ధతి గురించి బ్రిటన్ లోని సంతాన సాఫల్య కేంద్రంలో పనిచేసే వైద్యుడు ఒకరు మాట్లాడుతూ, పిండం ఏర్పడిన తొలిరోజు నుంచి కొన్ని రోజుల వరకు దాని ఎదుగుదలను ఫొటోలు తీసి యూఎస్బీ డివైస్ లో భద్రపరుస్తుందన్నారు. పిండం అభివృద్ధిని ఫొటోల సాయంతో పది నిమిషాలకు ఒకసారి పరీక్షించే అవకాశం వైద్యులకు లభిస్తుందని అన్నారు.