: సల్మాన్ తో డేటింగ్ అంటే ఎవరు కాదంటారు?: ఎమీ జాక్సన్


అందాలతార ఎమీ జాక్సన్ తో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ డేటింగ్ చేస్తున్నాడంటూ బీటౌన్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. లులియా వంతూర్ తో బంధం తెంపుకున్న సల్లూ భాయ్ ప్రస్తుతం ఎమీ జాక్సన్ తో స్నేహం చేస్తున్నాడని, వీరిద్దరూ ప్రేమలోకంలో విహరిస్తున్నారని బాలీవుడ్ లో కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో ప్రస్తుతం తాను నటించిన ఓ పంజాబీ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఎమీ జాక్సన్ ను మీడియా వర్గాలు డేటింగ్ గురించి ప్రశ్నించాయి. దీంతో వెంటనే స్పందించిన ఎమీ... సల్మాన్ తో డేటింగ్ అంటే ఎవరు కాదంటారు చెప్పండి? అని మీడియాను ఎదురు ప్రశ్నించింది. ఊహించని సమాధానంతో మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు. వారు తేరుకునేంతలోనే తనే మళ్లీ కల్పించుకుని, ప్రస్తుతానికి తాను సింగిల్ గానే ఉన్నానని, ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని తెలిపింది.

  • Loading...

More Telugu News