: పదవి నుంచి దిగిపోతూ భారత్ ను హెచ్చరించిన పాక్ ఆర్మీ చీఫ్
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ ఈరోజు పదవి నుంచి దిగిపోతూ కూడా భారత్ ను హెచ్చరించారు. రహీల్ పదవీ విరమణ కార్యక్రమాన్ని రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. రహీల్ షరీఫ్ తన పదవీ బాధ్యతలను కొత్త ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వాకు అప్పగించారు. ఈ సందర్భంగా రహీల్ మాట్లాడుతూ, కాశ్మీర్ ఉద్రిక్తతల విషయంలో తమ సంయమనాన్ని బలహీనతగా భారత్ భావిస్తే కనుక పొరపాటు పడినట్లేనని.. అలా భావిస్తే భారత్ కు ప్రమాదకరమేనని అన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో భారత్ దురాక్రమణ పూరిత చర్యలకు దిగుతుండటంతో ఈ ప్రాంతంలో శాంతిభద్రతలు ప్రమాదంలో పడ్డాయని అన్నారు.