: ఆదిలోనే వికెట్ కోల్పోయిన టీమిండియా


మొహాలీలో జ‌రుగుతున్న‌ మూడో టెస్టు మ్యాచులో నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ టీమ్ 236 ప‌రుగుల‌కే ఆలౌట‌యి టీమిండియా ముందు 103 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచిన సంగ‌తి తెలిసిందే. స్వ‌ల్ప ల‌క్ష్య ఛేద‌న‌లో క్రీజులోకి టీమిండియా ఓపెనెర్లుగా విజ‌య్‌, పార్థివ్ ప‌టేల్ లు వ‌చ్చారు. అయితే క్రీజులోకి వ‌చ్చిందే ఆల‌స్యం వోక్స్ బౌలింగ్‌లో రూట్స్‌కి క్యాచ్ ఇచ్చుకుని ప‌రుగుల ఖాతా తెరవ‌కుండానే విజ‌య్ వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం క్రీజులో ప‌టేల్‌ (7 ప‌రుగులు)తో పాటు పుజారా(1) ఉన్నాడు.

  • Loading...

More Telugu News