: మైసూరారెడ్డి అకౌంట్లో ఎంత డబ్బు ఉందని ప్రశ్నించిన హైకోర్టు


పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మాజీ ఎంపీ మైసూరా రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నా... ఖాతాదారులకు బ్యాంకులు డబ్బు ఇవ్వడం లేదని ఆయన పిటిషన్ లో ఆరోపించారు. ఈ పిటిషన్ ను ఈ రోజు హైకోర్టు విచారించింది. నోట్ల రద్దుతో కొంత కాలం పాటు ఇబ్బందులు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ముందే చెప్పింది కదా? అని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అసలు మైసూరారెడ్డి అకౌంట్లో ఎంత డబ్బు ఉందో చెప్పాలని అడిగింది. ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న మాట వాస్తవమేనని... అయితే, జీతం డబ్బులు తీసుకునే వారికి మాత్రం కొంత వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News