: పార్లమెంటు ఉభ‌యస‌భ‌లు ప్రారంభం.. మోదీ సమాధానం చెప్పాలంటూ పెద్దఎత్తున నినాదాలు.. వాయిదా


పార్లమెంటు ఉభ‌స‌భ‌లు ప్రారంభమ‌య్యాయి. పెద్ద‌నోట్ల ర‌ద్దుపై రాజ్య‌స‌భ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌మాధానం చెప్పాల్సిందేనంటూ విప‌క్ష‌నేత‌లు నినాదాలు చేశారు. చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో అవ‌స‌ర‌మ‌యిన‌ప్పుడు ప్ర‌ధాని వ‌చ్చి స‌మాధానం చెబుతార‌ని అధికార‌ప‌క్ష‌ నేత‌లు చెబుతున్నప్ప‌టికీ విప‌క్ష నేత‌లు వినిపించుకోవ‌డం లేదు. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తున్నారు. స‌భ‌కు స‌హ‌క‌రించాల‌ని అధికార ప‌క్ష‌నేత‌లు కోరారు. దీంతో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మ‌రోవైపు లోక్‌స‌భ‌లోనూ గంద‌ర‌గోళం నెలకొంది. విపక్ష నేతలు నినాదాలు చేయడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను 11.30గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

  • Loading...

More Telugu News