: ప‌రీక్ష‌కు సిద్ధ‌మైన హెచ్ఐవీ టీకా.. ద‌క్షిణాఫ్రికాలో అభివృద్ధి


హెచ్ఐవీని నియంత్రించేందుకు అభివృద్ధి చేసిన టీకా ట్రయ‌ల్‌ర‌న్‌కు సిద్ధ‌మ‌వుతోంది. హెచ్ఐవీని నియంత్రించే విష‌యంలో శాస్త్ర‌వేత్తలు చివ‌రిద‌శ‌కు చేరుకున్నారు. ఇందులో భాగంగా హెచ్‌వీటీఎన్ 702 అనే టీకా ప్ర‌స్తుతం ప‌రీక్ష‌ల ద‌శ‌కు చేరుకుంది. గ‌తంలో ప‌రీక్షించిన టీకాలు స‌త్ఫ‌లితాలు ఇవ్వ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి దీనిపై ప‌డింది. హెచ్‌వీటీఎన్ 702 క‌నుక విజ‌య‌వంత‌మైతే హెచ్ఐవీ నియంత్ర‌ణ‌కు స‌రికొత్త టీకా వ‌చ్చేసిన‌ట్టేన‌ని శాస్త్రవేత్త‌లు భావిస్తున్నారు. స‌రికొత్త టీకాను హెచ్ఐవీ సోకిన 5,400 మంది స్త్రీ,పురుషుల‌పై పరీక్షించ‌నున్న‌ట్టు అమెరికాలోని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అల‌ర్టీ అండ్ ఇన్‌ఫెక్సియ‌స్ డీసీజ్‌(ఎన్ఐఏఐడీ) డైరెక్ట‌ర్ ఆంథోని పాసీ తెలిపారు. ద‌క్షిణాఫ్రికాలోని మొత్తం 15 ప్రాంతాల్లో ప‌రీక్షిస్తున్న ఈ టీకాకు సంబంధించి 2020 నాటికి ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News